గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (13:16 IST)

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే చీఫ్‌గా పళనిస్వామి?

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో రెండు వైరి వర్గాలు ఒకటికానున్నాయి. ఈ రెండు గ్రూపులకు చెందిన నేతల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కివచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన డీల్‌పై ఇరువ

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో రెండు వైరి వర్గాలు ఒకటికానున్నాయి. ఈ రెండు గ్రూపులకు చెందిన నేతల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కివచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన డీల్‌పై ఇరువర్గాలు తుది అవగాహనకు వచ్చాయా? అవుననే తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్టేనని తాజా కథనాలు వినిపిస్తున్నాయి. 
 
ఇరువర్గాల మధ్య కుదిరినట్టు చెబుతున్న అవగాహన ప్రకారం మాజీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపట్టబోతున్నారు. అందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి మార్గం సుగమం చేస్తారు. శశికళ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను పళనిస్వామి చేపడతారు. రెండు వర్గాల విలీనం ప్రకటన సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
 
ఇదే అంశంపై పలువురు ఓ సీనియర్ నేత స్పందిస్తూ... రెండు వర్గాల విలీనం దాదాపు ఖాయమైందని, ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేయాల్సిన ప్రకటనపై చర్చల ప్రక్రియ మొదలైందన్నారు 'పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు వీలుగా సీఎం పదవి నుంచి పళని స్వామి వైదొలుగుతారు. పార్టీ చీఫ్‌ బాధ్యతలు పళనిస్వామి చేపడతారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో సహా దక్షిణ తమిళనాడుకు చెందిన ఒకరిద్దరు కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకుంటారు' అని ఆయన తెలిపారు.