1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (11:06 IST)

తీహార్ జైలుకు టీటీవీ దినకరన్... 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ మజిలి చివరకు తీహార్ జైలుకు చేరింది.

రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ మజిలి చివరకు తీహార్ జైలుకు చేరింది. ఈ కేసులో ఐదు రోజుల కష్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచగా, 15 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి విధించారు. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. 
 
అంతేకాకుండా, అవసరమైనప్పుడు టీటీవీ దినకరన్‌, ఆయన సన్నిహితుడిని తమ ముందు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా హాజరుపర్చాల్సిందిగా తీహార్‌ కేంద్ర కారాగారం అధికారవర్గాలను న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు, హవాలా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాథూసింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా న్యాయస్థానం ఈ నెల 15 వరకు పొడిగించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. మరిన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.