1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (13:26 IST)

మన నెక్స్ట్ టార్గెట్ కాశ్మీర్.. తాలిబన్లను అభినందించిన అల్‌ఖైదా

ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్ర సంస్థల్లో అల్‌ఖైదా ఒకరు. ఈ సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అగ్రరాజ్యం అమెరికా సైనికులు హతమార్చాయి. ఆ తర్వాత ఆ సంస్థ కార్యక్రమాలు చాలా మేరకు మందగించాయి. 
 
ఈ నేపథ్యంలో తాలిబన్ తీవ్రవాదులు ఆప్ఘనిస్థాన్ దేశాన్ని హస్తగతం చేసుకున్నాయి. దీంతో తాలిబన్లలకు అల్‌ఖైదా తీవ్రవాదులు అభినందనలు తెలుపుతూనే, మరోవైపు, కాశ్మీర్‌ను విడిపించుకుందామంటూ పిలుపునిచ్చారు. ఇస్లామేత‌ర శ‌క్తుల నుంచి కాశ్మీర్‌నూ విడిపించుకుందామ‌ంటూ పిలుపునిచ్చింది. 
 
అమెరికా సేన‌లు ఆఫ్ఘ‌న్‌ను విడిచి వెళ్లిన మ‌రుస‌టి రోజే అల్‌ఖైదా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇస్లాం శ‌త్రువుల నుంచి లెవాంట్‌, సోమాలియా, యెమెన్‌, క‌శ్మీర్‌తోపాటు ఇత‌ర ముస్లింల భూభాగాల‌ను విడిపించుకుందాం. 
 
ఓ అల్లా.. ప్ర‌పంచంలోని ముస్లిం ఖైదీలంద‌రికీ స్వేచ్ఛ ప్ర‌సాదించు అని ఆ ప్ర‌క‌ట‌న‌లో అల్‌ఖైదా చెప్పింది. అమెరికా సేన‌లు వెళ్ల‌గానే తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్థాన్‌కు పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్ర‌క‌టించుకున్న విష‌యం తెలిసిందే. ఆ తర్వాత తాలిబ‌న్ల‌కు అల్‌ఖైదా శుభాకాంక్ష‌లు చెబుతూ ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.