ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (22:18 IST)

కెప్టెన్ విజయకాంత్‌ను ఎవరు చంపారో తేల్చాలి: అల్ఫోన్స్ పుత్రేన్

vijayakanth
తమిళనాడు స్టార్ హీరో, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ మృతితో సినీ, రాజకీయ రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే విజయకాంత్‌ను ఎవరో హత్య చేశారని మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
 
తమిళనాడు స్టార్ హీరో, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ మృతితో సినీ, రాజకీయ రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో పరిశ్రమలో గందరగోళం నెలకొంది. అయితే విజయకాంత్‌ను ఎవరో హత్య చేశారని మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. 
 
ఈ పోస్ట్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. అల్ఫోన్స్ పుత్రన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
 
"ఉదయనిధి స్టాలిన్ అన్నా.. నేను కేరళ నుంచి చెన్నైకి వచ్చి రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని నువ్వు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పాను. కలైంజర్ (కరుణానిధి)ని ఎవరు హత్య చేశారో, ఉక్కు మహిళ జయలలితను ఎవరు హత్య చేశారో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని కోరాను. 
 
ఇక కెప్టెన్ విజయకాంత్‌ను ఎవరు చంపారో కూడా తేల్చాలి. ఇదంతా ఏంటి అనేది పక్కన పెడితే.. ఇప్పటికే ఇండియన్ 2 సెట్స్‌లో కమల్ హాసన్‌లపై హత్యాయత్నం జరిగింది. ఈ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే.. స్టాలిన్ సార్ మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు." అంటూ చెప్పుకొచ్చారు. అల్ఫోన్స్ పోస్ట్ కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది.