శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (09:38 IST)

స్టార్ హోటల్‌లో అమెరికన్ మహిళపై గ్యాంగ్ రేప్.. రెండు రోజుల పాటు రేప్.. వీడియో తీసి?

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐదు నక్షత్రాల హోటల్‌లో అమెరికా మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అత్యాచారానికి గురైన అమెరికన్ మహిళ దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు న

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐదు నక్షత్రాల హోటల్‌లో అమెరికా మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అత్యాచారానికి గురైన అమెరికన్ మహిళ దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. దీంతో పోలీసులు సైకాలజిస్టుల సహకారంతో గ్యాంగ్ రేప్ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 
ఈ దర్యాప్తులో అమెరికన్ మహిళపై గుర్తుతెలియని నిందితులు రెండురోజులపాటు అత్యాచారం చేసి దాన్ని వీడియోగా చిత్రీకరించారని తేలింది. అత్యాచార ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే రేప్ వీడియోను బయటపెట్టడంతోపాటు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ మహిళను నిందితులు బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగా లేదని అమెరికన్ మహిళ తరపు న్యాయవాది చెప్పారు.