శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (08:52 IST)

తాజ్ మహల్ ఓ అందమైన శ్మశాన వాటిక: అనిల్ విజ్

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌పై రోజు రోజుకీ వివాదం రాజుకుంటుంది. ఉత్తరప్రదేశ్ టూరిజం గైడ్‌లో తాజ్‌మహల్‌కు స్థానం కల్పించకపోవడంతో ప్రారంభమైన వివాదం, రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికగా మారిప

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌పై రోజు రోజుకీ వివాదం రాజుకుంటుంది. ఉత్తరప్రదేశ్ టూరిజం గైడ్‌లో తాజ్‌మహల్‌కు స్థానం కల్పించకపోవడంతో ప్రారంభమైన వివాదం, రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికగా మారిపోయింది. 
 
తాజాగా హర్యానా క్రీడల మంత్రి అనిల్ విజ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. తాజ్ మహల్ ఓ అందమైన శ్మశానం అని అనిల్ విజ్ చేసిన కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
మరోవైపు తాజ్ మహల్ భారత సంస్కృతిపై మాయనిమచ్చ అంటూ ఇటీవలే యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది. ఈ వివాదం సమసిపోకముందే హర్యానా మంత్రి ట్వీట్ చేయడం విమర్శలకు దారితీసింది.