బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (14:24 IST)

ప్రధాని నరేంద్ర మోడీ వారసుడు ఆయనే...

amit shah
ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఇపుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలో తదుపరి నేత ఎవరు అన్నది ఇపుడు చాలా మందిలో ఉత్పన్నమైన ప్రశ్న. మోడీ తర్వాత బీజేపీలో ఆ బాధ్యతలను అందుకునేది ఎవరు, మోడీ రాజకీయ వారసుడు ఎవరు అనే విషయాలపై ఇప్పటికే చర్చ జరుగుతుంది. 
 
ఈ అంశానికి సంబంధించి ఇండియా టుడే - సీఓటర్ సంస్థలు తాజాగా ఓ సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో ప్రధాని మోడీ తర్వాత అత్యధిక ప్రజాదారణ కలిగిన నేతగా కేంద్ర హోం అమిత్ షా నిలిచారు. మోడీ తర్వాత ప్రధాని పదవిలో ఎవరిని చూడాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు 29 మంది ఓటర్లు అమిత్ షా పేరును చెప్పారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరును 26 శాతం మంది, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 15 శాతం మంది చొప్పున మొగ్గు చూపారు.