సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (12:25 IST)

ఏప్రిల్ 25న హైదరాబాదుకు అమిత్ షా..

amit shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ తదితరులు హాజరవుతారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన వరంగల్‌తో పాటు రెండు, మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో పార్టీపరంగా నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేందుకు అమలు చేస్తున్న కార్యాచరణ, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న కృషి, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలను ముఖ్య నేతలతో సమీక్షిస్తారని తెలుస్తోంది.