గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:48 IST)

కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకేతో వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ

YS Sharmila met DK Shivakumar
YS Sharmila met DK Shivakumar
ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి బుధవారం కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య రాజకీయ చర్చ సాగినట్లు తెలుస్తోంది.

అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టాల్సిన ర్యాలీలు, సభల నిర్వహణపై వైఎస్ షర్మిల డీకేకు వివరించారు. ఈ సందర్భంగా పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై డీకే షర్మిలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. అలాగే పలు నియోజక వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల డీకేను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.