శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 మార్చి 2017 (09:25 IST)

స్మగ్లర్ సంగీత ఛటర్జీని కో‌ల్‌కతా పిజ్జా కార్నర్ వద్ద పట్టేశారు.. 14 రోజుల రిమాండ్

అంతర్జాతీయ స్మగ్లర్, మాజీ మోడల్ సంగీత ఛటర్జీ (26)ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఛటర్జీని డీఎస్పీ గిరిధర్‌, సీఐ ఆదినారాయణ, ఎస్‌ఐ వాసంతి బృందం మంగ

అంతర్జాతీయ స్మగ్లర్, మాజీ మోడల్ సంగీత ఛటర్జీ (26)ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఛటర్జీని డీఎస్పీ గిరిధర్‌, సీఐ ఆదినారాయణ, ఎస్‌ఐ వాసంతి బృందం మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఆమెను కొల్‌కతా కస్బారోడ్‌లోని ఓ పిజ్జా కార్నర్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో బెంగుళూరు, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో చిత్తూరుకి తరలించారు. బుధవారం పాకాల కోర్టులో ఆమెను హాజరుపరచగా, జడ్జి దేవేంద్రరెడ్డి సంగీతకు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు.
 
ఇకపోతే.. గత ఏడాది జూన్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాలో అరెస్టయిన సంగీత ఛటర్జీకి చెందిన పలు బ్యాంకుల లాకర్లలో ఉన్న రూ.కోటి విలువైన నగలు, డాక్యుమెంట్లను జిల్లా పోలీసులు సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన మార్కొండ లక్ష్మణ్‌ను 2014లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను రిమాండ్‌కు పంపి, పీడీ యాక్టు నమోదు చేశారు. ఇతని వద్ద చేసిన విచారణలో తనకు కలకత్తాలో రెండవ భార్య సంగీత ఛటర్జీ ఉందని చెప్పారు. ఇతడు ఇచ్చిన వివరాల ఆధారంగా సంగీత ఛటర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు.