అడిగిన డబ్బులు ఇవ్వలేదనీ ప్రయాణికుడిపై దాడి చేసిన హిజ్రాలు!
అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిపై ముగ్గురు హిజ్రాలు దాడిచేసిన ఘటన సంచలనం రేపింది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓంప్రకాశ్ జస్వాల్ (40) అనే వ్యక్తి ఒంగోలులో
అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిపై ముగ్గురు హిజ్రాలు దాడిచేసిన ఘటన సంచలనం రేపింది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓంప్రకాశ్ జస్వాల్ (40) అనే వ్యక్తి ఒంగోలులో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార నిమిత్తం న్యూఢిల్లీ-చెన్నై మధ్య నడిచే అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి జనరల్ బోగీలో కూర్చున్నాడు. కాగా జమ్మికుంటలో ఈ రైలులోకి ఎక్కిన హిజ్రాలు ఓం ప్రకాష్‌ను డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు.
అయితే డబ్బులు ఇవ్వడానికి ఓంప్రకాశ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపం కట్టలు తెంచుకున్న హిజ్రాలు అతడిని కాళ్లతో తన్ని కిటికి వద్దకు నెట్టేశారు. దీంతో అతడికి తలకు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. హిజ్రాలు కాజీపేట-వరంగల్ మధ్య దిగి పరారయ్యారు. తోటి ప్రయాణికులు ఓంప్రకాశ్‌ను వరంగల్‌లో దింపి ఆసుపత్రికితరలించారు. బాధితుడు ఓంప్రకాశ్ జస్వాల్ శుక్రవారం సాయంత్రం కాజీపేట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.