గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (15:44 IST)

పెద్ద నోట్ల రద్దుపై 5 సలహాలు ఇస్తే రెండే అమలు చేశారు.. అందుకే గందరగోళం : అనిల్ బోకిల్

దేశంలో అవినీతిని అరికట్టేందుకు, మగ్గుతున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు తాను మొత్తం ఐదు సలహాలు ఇస్తే.. వాటిలో రెండింటినే అమలు చేశారని అర్థక్రాంతి వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ చెప్పుకొచ్చారు. అందువల్లే ఈ

దేశంలో అవినీతిని అరికట్టేందుకు, మగ్గుతున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు తాను మొత్తం ఐదు సలహాలు ఇస్తే.. వాటిలో రెండింటినే అమలు చేశారని అర్థక్రాంతి వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ చెప్పుకొచ్చారు. అందువల్లే ఈ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడుగా ఉన్న అనిల్ బోకిల్... పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సలహా ఇచ్చి దేశంలో గుర్తింపు పొందారు. 
 
అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరెన్సీ కష్టాలపై ఆయన స్పందిస్తూ... పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి తాను సమగ్రమైన ప్రణాళికను అందించానని... రద్దు అంశాన్ని ఎలా అమలు చేయాలో స్పష్టంగా తెలిపినట్టు చెప్పారు. ముఖ్యంగా.. పెద్ద నోట్ల రద్దుపై తాను ఐదు సలహాలు ఇస్తే... ప్రభుత్వం మాత్రం రెండు సలహాలను మాత్రమే పాటించిందని గుర్తు చేశారు. తమ సంస్థ అందజేసిన రోడ్ మ్యాప్‌ను యథాతథంగా అనుసరించినట్టైతే... ఇంత గందరగోళం చెలరేగేది కాదని ఆయన అన్నారు.