బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (11:41 IST)

ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ కరియప్పకు భారతరత్న?

భారత ఆర్మీ తొలి చీఫ్, ఫీల్డ్ మార్షల్ కరియప్ప పేరును భారత్ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు సిఫారసు చేశారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతరత్నకు కర

భారత ఆర్మీ తొలి చీఫ్, ఫీల్డ్ మార్షల్ కరియప్ప పేరును భారత్ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు సిఫారసు చేశారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతరత్నకు కరియప్ప అన్ని విధాలా అర్హులని అన్నారు. 
 
భారతరత్నకు కరియప్ప అనర్హుడు అని చెప్పడానికి మనకు ఒక్క కారణం కూడా కనిపించదన్నారు. ఎందరినో భారతరత్నతో సత్కరించారని... మన దేశ సైన్యానికి దిశానిర్దేశం చేసిన కరియప్పను కూడా ఆ పురస్కారంతో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. 
 
కర్ణాటకలోని కొడగు జిల్లాలో చదువుకున్న కరియప్ప ఆ తర్వాత సైన్యంలో చేరి ఆర్మీ చీఫ్‌గా ఎదిగారని చెప్పారు. శనివారం కొడగులో పర్యటించిన బిపిన్ రావత్... ఆర్మీ తొలి చీఫ్ కరియప్ప విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన‌పై విధంగా వ్యాఖ్యానించారు.
 
కాగా, 1949లో ఇండియన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్‌‍గా కరియప్ప నియమితులయ్యారు. 5 స్టార్ ర్యాంకింగ్ సాధించిన ఇద్దరు భారత సైనికాధికారుల్లో కరియప్ప ఒకరు. 1947 ఇండో-పాక్ యుధ్దం, 1965 ఇండో-పాక్ యుద్ధంలో కరియప్ప పాల్గొన్నారు. 1993, మే 15వ తేదీన కన్నుమూశారు.