ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:15 IST)

నేను 'గాడిదల కేటగిరీ' కిందకు వస్తా : ఆశారాం బాపు

దేశంలో ఉన్న వివాదాస్పద గురువుల్లో ఆశారాం బాపు ఒకరు. ఈయన వయసు 76 యేళ్లు. 2013లో జోథ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జ

దేశంలో ఉన్న వివాదాస్పద గురువుల్లో ఆశారాం బాపు ఒకరు. ఈయన వయసు 76 యేళ్లు. 2013లో జోథ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే గడుపుతున్నారు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దాదాపు ఏడు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కోసం ఆయన కోర్టుకు వచ్చారు. ఆసమయంలో కొందరు మీడియా ప్రతినిధులు ప్రధాన హిందూ ధార్మిక సంస్థ అఖిల భారతీయ అకారా పరిషత్ వెల్లడించిన నకిలీ బాబాల జాబితాలో మీ పేరు కూడా ఉంది కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించారు. 
 
దీనిపై ఆశారాం బాపు స్పందిస్తూ, తనను తానే గాడిదగా పోల్చుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, తాను ''గాడిదల కేటగిరీ" సమాధానమిస్తూ కోర్టు మెట్లపైకి కోపంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.