శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:09 IST)

ఆటో ఓనర్‌కు మత్తుమందిచ్చి రేప్ చేశాడు.. దాన్నీ వీడియో తీసి భర్తకు పంపాడు..

ఆటో రిపేర్ కోసం డబ్బులిచ్చేందుకు వచ్చిన ఆటో ఓనరమ్మకు ఆటో డ్రైవర్ పానీయంలో మత్తు మందు ఇచ్చాడు. ఆపై ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్ని మొబైల్‌తో వీడియో తీశాడు. ఈ ఘటన మహారాష్ట్రల

ఆటో రిపేర్ కోసం డబ్బులిచ్చేందుకు వచ్చిన ఆటో ఓనరమ్మకు ఆటో డ్రైవర్ పానీయంలో మత్తు మందు ఇచ్చాడు. ఆపై ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్ని మొబైల్‌తో వీడియో తీశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ముంబై నగరంలోని శాంతాక్రజ్ పరిధిలోని గజ్ దర్భంద్ ప్రాంతానికి చెందిన సర్తాజ్ షేక్ (28) ఆటోడ్రైవరుగా పనిచేస్తున్నాడు. 
 
సర్తాజ్ షేక్ అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల వివాహిత మహిళ నుంచి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. ఇంతలో ఆటో రిపేర్ కావడంతో దాన్ని మరమ్మత్తు చేసుకునేందుకు డబ్బులివ్వాలని ఆటో యజమాని అయిన మహిళను కోరాడు. డబ్బులిచ్చేందుకు వచ్చిన వివాహితకు సర్తాజ్ మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చాడు. దాన్ని తాగిన ఆమె మత్తులోకి జారిపోయింది. ఆమెపై సర్తాజ్ అత్యాచారం చేస్తూ దాన్ని తన మొబైల్ లో వీడియో తీశాడు. ఆపై తనతో శారీరక సంబంధం కొనసాగించకుంటే రేప్ వీడియోను భర్తకు పంపిస్తానని సర్తాజ్ బెదిరించాడు. 
 
మహిళ నిరాకరించడంతో సర్తాజ్ ఆ వీడియోను వివాహిత భర్తకు పంపించాడు. ఈ వీడియో చూసిన వివాహిత భర్త షాక్ అయ్యాడు. ఆపై భార్యను వెంటబెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సర్తాజ్‌ను అరెస్ట్ చేశారు. మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.