అత్యవసర పరిస్థితుల్లో సైతం పాక్ గడ్డపై విమానాలు దించొద్దు: ఇండియన్ ఎయిర్ లైన్స్
అత్యవసర పరిస్థితుల్లో సైతం పాకిస్థాన్ గడ్డపై విమానాలు దించొద్దని విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్‌లైన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో పాకిస్థాన్‌లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరంగా విమానాలు ద
అత్యవసర పరిస్థితుల్లో సైతం పాకిస్థాన్ గడ్డపై విమానాలు దించొద్దని విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్‌లైన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో పాకిస్థాన్‌లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరంగా విమానాలు దించే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని భారత సైనికులు సర్జికల్ దాడులు చేయగా, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకునేలా పాకిస్థాన్ ప్లాన్ చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన గగనతలానికి సంబంధించి ఆంక్షలు విధించింది.
ఈ నేపథ్యంలో, విమానంలో మంటలు వ్యాపించడంవంటి తీవ్ర పరిస్థితుల్లో మినహా... పాక్ భూభాగంలో ఎమర్జెన్సీ ల్యాండ్ కావొద్దని ఎయిర్ ఇండియా తన పైలట్లకు తెలిపింది. అయితే ఈ సూచనలను మౌఖికంగా మాత్రమే చేసింది. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు పాక్ మీదుగానే ప్రయాణిస్తుంటాయి.