శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (10:34 IST)

లైంగిక కోరిక తీర్చకుంటే కాళ్లు నరికేస్తా.. స్పా సెంటర్ ఉద్యోగిని వార్నింగ్

లైంగిక కోరిక తీర్చకుంటే కాళ్లు నరికేస్తానంటూ ఓ స్పా సెంటర్ ఉద్యోగిని ఓ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ ఉద్యోగిని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.

లైంగిక కోరిక తీర్చకుంటే కాళ్లు నరికేస్తానంటూ ఓ స్పా సెంటర్ ఉద్యోగిని ఓ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ ఉద్యోగిని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరు నగరంలోని సదాశివనగర్ ప్రాంతానికి చెందిన కరుతూరి సాయిరామకృష్ణ మసాజ్ చేయించుకునేందుకు సదాశివనగర్‌లోని ఓ ఫ్యామిలీ స్పాకు వచ్చి రూ.11,800 ప్యాకేజీ తీసుకున్నాడు. 
 
మసాజ్ గదిలోకి వెళ్లిన రామకృష్ణకు అక్కడ మసాజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న యువతి(23)ని పిలిచి తన లైంగిక కోరిక తీర్చాలని కోరాడు. ఇది ఫ్యామిలీ స్పా అని ఇక్కడ అనైతిక కార్యకలాపాలు సాగవని నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా తన కోరిక తీర్చకుంటే కాళ్లు నరికేస్తానని హెచ్చరించాడు. అంతటితో ఆగని రామకృష్ణ ఇక్కడ వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. ఆ యువతి స్పా నిర్వాహకులతో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనిపై 304, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.