శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (10:53 IST)

బతుకుదెరువు కోసం వచ్చిన మహిళపై హెడ్‌ కానిస్టేబుల్‌ అత్యాచారం

బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన ఓ మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ దారుణం దేశ ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి

బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన ఓ మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ దారుణం దేశ ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి వచ్చిన మహిళ(35) భర్తతో కలిసి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలనీలో నివసిస్తోంది. భార్యాభర్తలిద్దరూ కూలీనాలి చేసుకుని జీవిస్తున్నారు.
 
ఈ క్రమంలో తాగుబోతు భర్త వేధిస్తున్నాడని పోలీసులకు నెలరోజుల క్రితం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా హెడ్‌ కానిస్టేబుల్‌ జి.పాల్‌కు ఆమెతో పరిచయం ఏర్పడగా దీన్ని ఆసరాగా చేసుకున్న అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాల్‌పై కేసు నమోదు చేసి రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.