బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (11:26 IST)

కర్నాటక ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై - అరుదైన జాబితాలో తండ్రీతనయులు

కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ‘సీఎం పీఠమెక్కిన తండ్రీ తనయుల ద్వయం’ జాబితాలో తన తండ్రితో కలిసి ఆయన చోటు సంపాదించన్నారు. 
 
బసవరాజు తండ్రి సోమప్ప రాయప్ప బొమ్మై కూడా 1988-89 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేయడం గమనార్హం. వీరే కాదు.. ఇంకా పలు రాష్ట్రాల్లో చాలామంది తండ్రి-తనయుల జోడీలు సీఎం పీఠాన్ని అలంకరించాయి. ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకున్న తండ్రి-కూతురు ద్వయంగా జమ్మూ-కశ్మీర్‌కు చెందిన ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్, మెహబూబా ముఫ్తీ రికార్డు సృష్టించారు.
 
కాగా, కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్.యడ్యూరప్పను తొలగించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆయన స్థానంలో బసవరాజ బొమ్మైను ఎంపిక చేసింది. లింగాయత్  సామాజిక వర్గానికి చెందిన ఈయన... ఇకపై కర్నాటకలో కమలం పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నారు. 
Basavaraj Bommai take oath as 23rd chief minister of Karnataka at 11 am today
Basavaraj Bommai, Oath, 23rd Chief Minister, Karnataka, Today, 