శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మెట్రో పిల్లర్ కూలి తల్లీ బిడ్డ మృతి - రూ.10 కోట్ల పరిహారం

Cash
బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలడంతో తల్లీబిడ్డా ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి భర్త రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, బీఎంఆర్సీఎల్‌కు అత్యవసర నోటీసులు జారీచేసింది.
 
బీఎంఆర్సీఎల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయిందని, అందువల్ల తమకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ మృతురాలి భర్త లోహిత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపు న్యాయవాది ఎంఎఫ్ హుస్సేన్ వాదలను ఆలకించిన కోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, బెంగుళూరు జిల్లా కలెక్టర్, మెట్రో వర్క్స్ కాంట్రాక్ట్ కంపెనీకి నోటీసులు జారీచేసింది. 
 
కాగా, గత 2023 జనవరి 10వ తేదీన నాగవర సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఠఈ ప్రమాదంలో తేజస్విని ఎల్ సులాఖే (26), ఆమె రెండేళ్ల కుమారుడు విహాన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతురాలి భర్త వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.