బెంగుళూరులో 'నిర్భయ' ఘటన.. 'లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తా'నన్న కండక్టర్... డ్రైవర్ వత్తాసు
దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో మరో నిర్భయను తలపించే భయానక చర్య ఒకటి జరిగింది. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి యువతులపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం విషయం తెల్సిందే.
దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో మరో నిర్భయను తలపించే భయానక చర్య ఒకటి జరిగింది. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి యువతులపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం విషయం తెల్సిందే. దీనిపై చెలరేగిన దుమారం ఇంకా సద్దుమణగక ముందే... బెంగళూరు మహానగర సారిగె వాహనంలో ప్రయాణిస్తున్న ఓ యువతిపై లైంగిక దౌర్జన్యం జరిగింది. ఈ దాడికి పాల్పడింది కూడా బీఎంటీసీ ఉద్యోగులే కావడం గమనార్హం. వీరిద్దరిని సుబ్రమణ్యపుర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితురాలు ఫేస్‌బుక్‌లో ఉంచింది. వీటిపై బెంగుళూరు పోలీసులు స్పందించి.. కేసు నమోదు చేశారు. ఆ వెంటనే బాధ్యులుగా అనుమానిస్తున్న ఉత్తరహళ్లి బీఎంటీసీ డిపోలో పనిచేసే డ్రైవరు, కండక్లర్ మునియప్ప, సుధీర్‌లను శుక్రవారం అరెస్టు చేశారు.
బాధితురాలు ఫేస్‌బుక్‌లో పేర్కొన్న వివరాల మేరకు... ఈనెల 10న రాత్రి 8.10 గంటల సమయంలో రాగిగుడ్డ నుంచి ఉత్తరహళ్లికి వెళుతున్న బస్సులో ఓయువతి ప్రయాణించారు. ఆ సమయంలో 10 మంది మహిళలు అందులో ప్రయాణిస్తున్నారు. ఆమె రూ.20 అందించి కండక్టర్ నుంచి టిక్కెట్ కొన్నారు. ఆరు రూపాయల చిల్లర ఇవ్వాలి. 'తర్వాత ఇస్తా'నని కండక్టర్ చెప్పడంతో ఆమె మిన్నకున్నారు. తను దిగాల్సిన చోటుకు చేరువలో ఆమె చిల్లర విషయం గుర్తుచేయడంతో 'లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తా'నని కండక్టర్ వెటకారంగా బదులిచ్చాడు.
డ్రైవరుతో పాటు ఆ సమయానికి బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులూ ఆయనకు అండగా నిలిచారు. ఆమెను సతాయించారు. 'ఆ సమయంలో భయం వేసింది. డ్రైవరు, కండక్లరు ఇద్దరూ నా సంచి లాగేశారు. చేయిపట్టి గుంజారు. అసభ్యంగా ప్రవర్తించారు. దిల్లీలో సంచలనం రేపిన భయానక నిర్భయ ఘట్ట కళ్లముందు కదలాడింది. వాహనం ఆగిన వెంటనే నేను భయంతో పరుగులు తీశా'నంటూ ఆమె ఫేస్‌బుక్‌లో తన బాధనంతా మిత్రులతో పంచుకోవడం తీవ్ర సంచలనమే రేపింది. ఈ విషయం పోలీసుల దృష్టికీ వెళ్లడంతో వేగంగా స్పందించి నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. కేసు దర్యాప్తు చేపట్టారు.