శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:10 IST)

బావమరిది పెళ్లి.. వెళ్లకుంటే భార్య చేతిలో బతకలేను : కానిస్టేబుల్ ఆవేదన

మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ సెలవు కోసం పోలీసు ఉన్నతాధికారులకు రాసిన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను భార్యా బాధితుడని చెప్పుకొచ్చాడు. పైగా, తన బావమరిది పెళ్లి జరుగుతోందని, ఈ పెళ్లికి వెళ్లకుంటే తాను భార్య చేతిలో బతకలేనని వాయాపోయాడు. అందువల్ల తన పరిస్థితి అర్థం చేసుకుని సెలవు మంజూరు చేయాలని ఆ కానిస్టేబుల్ రాసిన లేఖలో విజ్ఞప్తి చేశాడు. 
 
ఈ లేఖ రాసిన కానిస్టేబులే పేరు దిలీప్ కుమార్ అహిర్వార్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, అతడు తాజాగా అధికారులకు రాసిన సెలవు చీటీ మీడియా దృష్టిని ఆకర్షించింది. 
 
త్వరలో తన బావమరిది పెళ్లి జరుగుతోందని, తనకు సెలవు ఇవ్వాల్సిందేనని దిలీప్ కుమార్ ఆ లేఖలో స్పష్టం చేశాడు. పొరబాటున కూడా సెలవు లేదని అనొద్దని, తాను ఈ పెళ్లికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పాడు.
 
ఒకవేళ తాను ఈ పెళ్లికి వెళ్లకపోతే జరిగే అనర్థాల గురించి తన భార్య ఇప్పటికే హెచ్చరించిందని, ఆ వివరాలను లేఖలో రాయలేని పరిస్థితి ఉందని, దయచేసి తనను అర్థం చేసుకుని సెలవు మంజూరు చేయాలని ప్రాధేయపడ్డాడు. 
 
దీనిపై పోలీసు అధికారులు స్పందించారు. ఈ సెలవు చీటీని తాము తీవ్రంగా పరిగణించడంలేదని, కిందిస్థాయిలో ఉండే ఉద్యోగులు సాకులు చెప్పి సెలవులు అడగడం సాధారణమైన విషయమేనని అన్నారు. 
 
పోలీసు ఉద్యోగం ఎంతో ఒత్తిడితో కూడుకున్నదే అయినా, ప్రజలకు వారు ప్రతిక్షణం అందుబాటులో ఉండాల్సిందేనని, దిలీప్ కుమార్‌కు సెలవు ఇవ్వలేమని వారు స్పష్టంచేశారు. ఇక నెటిజన్లయితే, ఎంతటివాడైనా భార్యాబాధితుడేనంటూ తమకు తోచిన దృష్టాంతాలను ఉదాహరిస్తున్నారు.బావమరిది పెళ్లి.. వెళ్లకుంటే భార్య చేతిలో బతకలేను : కానిస్టేబుల్ ఆవేదన 
Bhopal: Wife has warned, says cop in leave letter, gets taken off duty
Bhopal, Wife, Warn, Leave Letter, Police Constable, 
 
మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ సెలవు కోసం పోలీసు ఉన్నతాధికారులకు రాసిన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను భార్యా బాధితుడని చెప్పుకొచ్చాడు. పైగా, తన బావమరిది పెళ్లి జరుగుతోందని, ఈ పెళ్లికి వెళ్లకుంటే తాను భార్య చేతిలో బతకలేనని వాయాపోయాడు. అందువల్ల తన పరిస్థితి అర్థం చేసుకుని సెలవు మంజూరు చేయాలని ఆ కానిస్టేబుల్ రాసిన లేఖలో విజ్ఞప్తి చేశాడు. 
 
ఈ లేఖ రాసిన కానిస్టేబులే పేరు దిలీప్ కుమార్ అహిర్వార్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, అతడు తాజాగా అధికారులకు రాసిన సెలవు చీటీ మీడియా దృష్టిని ఆకర్షించింది. 
 
త్వరలో తన బావమరిది పెళ్లి జరుగుతోందని, తనకు సెలవు ఇవ్వాల్సిందేనని దిలీప్ కుమార్ ఆ లేఖలో స్పష్టం చేశాడు. పొరబాటున కూడా సెలవు లేదని అనొద్దని, తాను ఈ పెళ్లికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పాడు.
 
ఒకవేళ తాను ఈ పెళ్లికి వెళ్లకపోతే జరిగే అనర్థాల గురించి తన భార్య ఇప్పటికే హెచ్చరించిందని, ఆ వివరాలను లేఖలో రాయలేని పరిస్థితి ఉందని, దయచేసి తనను అర్థం చేసుకుని సెలవు మంజూరు చేయాలని ప్రాధేయపడ్డాడు. 
 
దీనిపై పోలీసు అధికారులు స్పందించారు. ఈ సెలవు చీటీని తాము తీవ్రంగా పరిగణించడంలేదని, కిందిస్థాయిలో ఉండే ఉద్యోగులు సాకులు చెప్పి సెలవులు అడగడం సాధారణమైన విషయమేనని అన్నారు. 
 
పోలీసు ఉద్యోగం ఎంతో ఒత్తిడితో కూడుకున్నదే అయినా, ప్రజలకు వారు ప్రతిక్షణం అందుబాటులో ఉండాల్సిందేనని, దిలీప్ కుమార్‌కు సెలవు ఇవ్వలేమని వారు స్పష్టంచేశారు. ఇక నెటిజన్లయితే, ఎంతటివాడైనా భార్యాబాధితుడేనంటూ తమకు తోచిన దృష్టాంతాలను ఉదాహరిస్తున్నారు.