ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

స్నేహితులతో పందెం కాసి..150 మోమోస్ ఆరగించిన యువకుడి మృతి

momos
బీహార్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. స్నేహితులతో పందెం కాసిన ఓ యువకుడు.. 150 మోమోస్‌లు ఆరగించి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని గోపాల్ గంజ్ సివాన్ జిల్లా సరిహద్దుల్లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఇటీవల రోడ్డు పక్కన పడివున్న ఓ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిపిన విచారణలో మృతుడి పేరు విపిన్ కుమారుడిగా గుర్తించారు. తూర్పు చంపారన్ జిల్లాలోని సిహోర్వా గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. సివాన్‌ జిల్లాలోని గ్యానీమోర్‌ సమీపంలో విపిన్‌ ఓ మొబైల్‌ రిపేర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. 
 
ఇటీవల తన స్నేహితులతో కలిసి విపిన్ మోమోలు తినే పందెం కాశాడు. ఈ క్రమంలో ఏకంగా 150 వరకు మోమోలు తిని తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే ప్రాణాలు విడిచాడు' అని పోలీసు అధికారి శశిరంజన్‌ తెలిపారు. కాగా, విపిన్‌ను అతడి స్నేహితులు కావాలనే విషం పెట్టి చంపారని తండ్రి విష్ణు మాంఝీ ఆరోపిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.