మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:33 IST)

పాలమూరు జిల్లాలో బస్సును ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

road accident
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. కాలేజీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. లారీ సృష్టించిన బీభత్సంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కాలేజీ విద్యార్థులు గాయపడ్డారు. 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ ఠాణా సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ప్రతిభా జూనియర్‌ కళాశాలకు చెందిన బస్సు కొంతమంది విద్యార్థులతో కళాశాలకు వస్తోంది. ఈ  క్రమంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎదురుగా రహదారిపై మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది.
 
అదేసమయంలో ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కళాశాల బస్సులో ఉన్న విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.