సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (09:16 IST)

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

road accident
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలోని పింపుల్ గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న బస్సు లోయలో పడటంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41మంది ప్రయాణీకులు వున్నారు. 
 
శనివారం తెల్లవారుజామున పూణె-రాయగడ్ సరిహద్దులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. 
 
బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. రాయగడ్‌లోని ఖోపోలి ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు పోలీసు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.