శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (15:25 IST)

మే ఒకటో తేదీ నుంచి జీఎస్టీ కొత్త రూల్...

gstimage
మే నెల ఒకటో తేదీ నుంచి జీఎస్టీ కొత్త రూల్ అమల్లోకి రానుంది. వ్యాపార సంస్థలకు సంబంధించిన ఈ నిబంధన ప్రకారం రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను జారీ చేసిన వారం రోజుల్లోపే ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ుఉంటుందని జీఎస్టీ నెట్‌వర్క్ తెలిపింది. 
 
ఇప్పటివరకు ఎలక్ట్రానికి ఇన్‌వాయిస్‌లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ఐపీఆర్‌లో అప్‌లోడ్ చేస్తున్నాయి. ఇకపై అలా చేయడానికి వీల్లేదు. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ-ఇన్‌వాయిస్ ఐపీఆర్ పోర్టల్‌లో పాత్ ఇన్‍‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయడానికి కాలపరిమితిని విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జీఎస్టీ నెట్‌వర్క్ తెలిపింది. 
 
ఈ కొత్త నిబంధన కేవలం ఇన్‌వాయిస్‌లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ నోట్‌లను నివేదించడంలో ఎలాంటి కాలపరిమితిని విధించలేదు. జీఎస్టీ చట్టం ప్రకారం ఐఆర్‌పీలో ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందలేవు. ప్రస్తుతం రూ.10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు అన్నీ బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను రూపొందించడం తప్పనిసరి.