గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (10:29 IST)

ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు... త్వరలో రూ.70 వేలకు చేరే ఛాన్స్..

gold-money
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేలు దాటిపోయింది. గడిచిన 10 రోజుల్లోనే 10 గ్రాముల బంగారు ధర దాదాపు రూ.5 వేలు పుంజుకుంది. మున్ముందు ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గతవారం భువనేశ్వర్‌లో రూ.57,620గా ఉన్న బంగారం ధర ఇపుడు రూ.61,400కు చేరింది. దీంతో ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ధర రూ.70 వేలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆభరణాల తయారీ కోసం వినియోగించే బంగారం ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. 
 
ఈ నెల 9వ తేదీన 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర భువనేశ్వర్‌లో రూ.50,500గా ఉంది. ఇపుడు ఈ ధర రూ.55,400కు చేరుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ బంగారం ధరలు ఒక్క భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.