శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (14:52 IST)

హామీలు మరిచి విగ్రహాలపై దృష్టిసారించారు.. అందుకే ఓడాం : బీజేపీ ఎంపీ

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విస్మరించి విగ్రహాల ఏర్పాటు, ఆలయాల నిర్మాణంపైనే దృష్టిసారించారనీ అందుకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినట్టు బీజేపీ ఎంపీ సంజయ్ కేకడే అభిప్రాయపడ్డారు. 
 
ఈయన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తప్పదనే విషయం తమ పార్టీ నేతలందరికీ తెలుసన్నారు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడమే తమను ఆశ్యర్యానికిలోను చేసిందన్నారు. 
 
ముఖ్యంగా, గత 2014 ఎన్నికల్లో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారనీ, కానీ, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరచిపోయారనీ ఆయన సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణం, విగ్రహాల నిర్మాణం, నగరాల పేర్ల మార్పుపైనే పార్టీ దృష్టి సారించిందని, ఈ ఎన్నికల్లో అదే కొంప ముంచిందన్నారు.