శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (18:40 IST)

కన్నడనాట 'ఆపరేషన్ ఆకర్ష్' స్టార్ట్ : ఐపీఎస్ అధికారుల బదిలీ... ఎమ్మెల్యేలకు గాలం...

పలు నాటకీయ పరిణామాల మధ్య గురువారం ఉదయం 9 గంటలకు కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు.

పలు నాటకీయ పరిణామాల మధ్య గురువారం ఉదయం 9 గంటలకు కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. నిజానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు బీజేపీకి లేకపోయినప్పటికీ.. దక్షిణాదిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావాలన్న మొండిపట్టుదలతో అనైతికంగా కమలనాథులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
 
ఇపుడు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం కాంగ్రెస్, జేడీఎస్‌లతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, తమ వైపుకు వచ్చే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల నగదుతో పాటు కేబినెట్‌‌లో మంత్రిపదవిని కేటాయిస్తాంటూ బీజేపీ నేతలు ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు తమతమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాయి. 
 
మరోవైపు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యడ్యూరప్ప తన అధికారిక కార్యకలాపాలు కూడా చేపట్టారు. ఇందులోభాగంగా, రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. బదిలీ అయినవారిలో…. ఏడీజీపీ (రైల్వే)గా ఉన్న అమర్ కుమార్ పాండే ఏడీజీపీ ఇంటిలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. 
 
కేఎస్‌ఆర్‌పీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న సందీప్ పాటిల్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఇంటిలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. బీదర్ ఎస్పీగా ఉన్న డి.దేవరాజా నుంచి బెంగళూరు సీటీ సెంట్రల్ డివిజన్ డీసీపీ‌గా బదిలీ అయ్యారు. ఏసీబీ ఎస్పీగా ఉన్న గిరీష్ బెంగళూరు సీటీ నార్త్ ఈస్ట్ డివిజన్ డీసీపీగా బదిలీ చేశారు. అంతకుముందు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రైతుల రుణమాఫీ ఫైలుపై సీఎం యడ్యూరప్ తొలి సంతకం చేశారు.