శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (18:47 IST)

రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకోబోదు.. సీఎం ఎవరనేది నిర్ణయించదు: వెంకయ్య

తమిళ రాజకీయాలతో పాటు.. పలు అంశాలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకోబోదని వెంకయ్య స్పష్టం చేశారు. ఆ రాష్ట్రానికి సీఎం ఎవరనేది బీజేపీ నిర్ణయించలేదన్నారు

తమిళ రాజకీయాలతో పాటు.. పలు అంశాలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకోబోదని వెంకయ్య స్పష్టం చేశారు. ఆ రాష్ట్రానికి సీఎం ఎవరనేది బీజేపీ నిర్ణయించలేదన్నారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బాధాకరమని వెంకయ్య స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి తమిళ రాజకీయాలతో పాటు, పలు అంశాలపై మాట్లాడారు. 
 
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని వెంకయ్య తెలిపారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీనిపై స్పందించిన వెంకయ్య.. ఎన్నికల కారణంగా కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవచ్చునని అన్నారు.
 
ఎన్నో తప్పులు చేసిన కాంగ్రెస్ తమకు ప్రవచనాలు చెప్పడమేంటని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గతంలో ప్రధానిని కలిశారని.. భవిష్యత్‌లో కూడా కలుస్తారని వెంకయ్య తెలిపారు. మోడీకి వస్తోన్న ఆదరణను చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆ పార్టీపై నిప్పులు చెరిగారు.