మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2023 (15:30 IST)

బోయింగ్ 737 మ్యాక్స్ విమానం నట్లు, బోల్టులు ఊడిపోతున్నాయి...

boeing
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల భద్రతపై అనేక రకాలైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1370 బోయింగ్ 737 మ్యాక్స్ విమానా తిరుగుతున్నాయి. ఈ సంస్థకు చెందిన విమానాలకు బోల్టులు, నట్లు ఊడిపోతున్నాయి. అలాగే, విమాన నియంత్రణకు కీలకమైన రడ్డర్ వ్యవస్థలో లోపం ఉన్నట్టు గుర్తించారు. యాక్సెస్ ప్యానెల్ విప్పిచూస్తే లోపం ఉన్నదీ లేనిదీ తెలుస్తుందని బోయింగ్ తెలిపింది.
 
కాగా, గత ఐదేళ్ళ క్రితం ఈ విమానాలు వరుస ప్రమాదాలకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన బోయింగ్ సంస్థ ప్రస్తుతం ఉన్న విమానాల్లో ఇలాంటి సమస్య ఏమైనా ఉందేమో చూసుకోవాలని కోరింది. తామైతే ఈ సమస్యను సరిచేశామని, మిగిలిన విమానాల్లో సమస్యలేమైనా ఉన్నాయేమో సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఒక యాక్సెస్ ప్యానెల్ విప్పి చూస్తే సమస్య ఉన్నదీ, లేనిదీ తెలిసిపోతుందని పేర్కొంది. 
 
ఒక వేళ సమస్య ఉన్నట్టు గుర్తించే రెండు గంటల్లోనే సరి చేయవచ్చని అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. కాంగ్రెస్ ఐదు సంవత్సరాలు క్రితం నెలల వ్యవధిలో ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిన దుర్ఘటన 346 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు. 
 
మహిళపై లైంగిక దాడికి పాల్పడిన పోలీస్ అధికారుల వ్యాను డ్రైవర్లు 
 
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ 32 యేళ్ల మహిళపై పోలీస్ ఉన్నతాధికారుల కార్లు డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో డిప్యూటీ కమిషనర్ డ్రైవర్‌గా ధర్మేంద్ర కుమార్ (30), పాలము ఎస్పీ డ్రైవర్ ప్రకాశ్ కుమార్ (40)లు పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ మొబైల్ రీచార్జ్ కోసం దల్తోంగంజ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ దుకాణానికి వెళుతుండగా, ఆమెను గమనించిన ఈ ఇద్దరు డ్రైవర్లు ఆమెతో మాటలు కలిపారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలోని రెసిడెంట్స్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. 
 
అయితే, బాధిత మహిళ ఆ ఇద్దరు కామాంధులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితులను అరెస్టు చేసారు. మహిళపై లైంగికదాడి జరిగిన మాట నిజమేనని పాలము ఎస్పీ రీష్మా రమేశన్ నిర్ధారించారు. అరెస్టు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.