బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (18:27 IST)

17 ఏళ్ల బాలుడిపై అత్యాచారయత్నం.. బండ రాయితో మోది..?

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మధురవోయల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తొమ్మిదేండ్ల బాలుడిపై ఓ 17 ఏండ్ల బాలుడు అత్యాచారయత్నం చేశాడు. అయితే, అందుకు తొమ్మిదేండ్ల బాలుడు సహకరించపోవడంతో ఆగ్రహానికి లోనైన 17 ఏండ్ల బాలుడు తీవ్రంగా దాడిచేశాడు. పక్కనే ఉన్న బండ ముక్కతో విచక్షణారహితంగా కొట్టాడు. బాధిత బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు పారిపోయాడు.
 
ఇంతలో బాధిత బాలుడి జాడ కోసం వెతికిన అతని తల్లిదండ్రులు ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. దాంతో కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులకు మధురవోయల్ బైపాస్ సమీపంలో అపస్మారక స్థితిలో బాలుడు కనిపించాడు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టిన పోలీసులు.. 17 బాలుడు నిందితుడిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు కేర్ హోమ్‌కు తరలించారు.