గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (15:01 IST)

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు మంత్రి అనిల్ సవాల్

టీడీపీ ఏపీ శాఖ అచ్చెన్నాయుడుకి ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సవాల్ చేశారు. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్దామంటూ ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. 
 
పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కనిపిస్తుందని ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల తీర్పు తమ వైపే ఉందంటూ ఆయన పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలకు మించిన పలితాలు వస్తున్నాయంటూ ఆయన అభిప్రాయపడ్డారు. 13 జిల్లాల జెడ్పీ పీఠాల్ని వైసీపీ కైవసం చేసుకోబోతుందంటూ మంత్రి అనిల్ జోస్యం చెప్పారు. 
 
టీడీపీకి నామినేషన్ వేసే దిక్కు కూడా లేక ఎన్నికల ముందు చేతులెత్తేశారని ఆరోపించారు. దమ్ముంటే మీకున్న 19 ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యండి ఎన్నికలకు వెళదాం అంటూ అనిల్ అచ్చెన్నాయుడిపై ఫైర్ అయ్యారు. ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని.. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అనిల్‌.. అచ్చెన్నాయుడికి సూచించారు.