ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:38 IST)

పాము కాటుతో అన్న మృతి: అంత్యక్రియలకు వచ్చిన సోదరుడినీ కాటేసిన పాము

Snake
అన్నదమ్ములపై విధి పగపట్టిందా అనేట్లు ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాము కాటుకి అన్నయ్య చనిపోతే అతడి అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన తమ్ముడిని కూడా పాము కాటు వేసింది. దీనితో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.

 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భవానీపూర్‌కి చెందిన 38 ఏళ్ల అరవింద్ మిశ్రా మంగళవారం రాత్రి పాముకాటుకి గురయ్యాడు. చికిత్స అందించేలోపే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న అతడి తమ్ముడు గోవింద మిశ్రా తన అన్నయ్య అంత్యక్రియలు చేసేందుకు వచ్చాడు. బుధవారం అంత్యక్రియలు పూర్తి చేసి ఇంట్లో నిద్రిస్తున్నాడు.

 
ఆ సమయంలో మరో పాము గోవింద మిశ్రాను కరిచింది. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడితో పాటు మరో వ్యక్తిని కూడా కాటు వేసింది. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు చెప్పారు. ఈ విషాదకర వార్త తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే కైలాస్ నాథ్ బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వ తరపున తగిన సాయం అందించి ఆదుకుంటామని తెలిపారు.