ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (20:21 IST)

16వేల మందికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. గుండెపోటుతోనే మృతి!

heart stroke
గుండెపోటుతో బాధపడిన 16వేల మంది రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడు అదే గుండెపోటుతో మృతి చెందడం వైద్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గౌరవ్ గాంధీ (41) గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందినవాడు. అతను హార్ట్ సర్జన్‌గా పనిచేశాడు. అతను తన కెరీర్‌లో 16,000 గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశాడు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రోగులకు చికిత్స చేసిన తర్వాత గౌరవ్ ఇంటికి చేరుకున్నారు. రాత్రి పూట భోజనం పూర్తి చేసుకుని హాయిగా నిద్రపోయారు. 
 
కానీ మంగళవారం ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు నిద్రలేపేందుకు ప్రయత్నించారు. నిద్ర లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు.