బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జూన్ 2023 (06:00 IST)

ఒడిశా ఘటన.. 316 మంది ఏపీ వాసులు సేఫ్.. మంత్రి బొత్స ప్రకటన

Train
ఒడిశాలోని బాలోసార్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 300మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతూనే వున్నాయి. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హవ్‌డాలో 300 మందికి పైగా ఏపీ వాసులు ప్రయాణించారు. ఇందులో కోరమాండల్‌లో జర్నీ చేసిన 267 మంది ఏపీ వాసుల్లో 20మంది స్వల్ప గాయాలకు గురయ్యారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఏపీ సర్కారు తెలిపింది. 
 
ఇక చివరి బోగీలు పట్టాలు తప్పిన హవ్ డా లో ప్రయాణించిన 49 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి 316 మంది సురక్షితంగా ఏపీ వాసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రయాణికుల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్ రెడ్డి, ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశా పంపించినట్లు చెప్పారు.
 
రైలు ప్రమాదంలో క్షతగాత్రులను, మృతులను త్వరితగతిన తీసుకు రావాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారన్నారు