శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (11:27 IST)

ప్రభుత్వ కార్యాలయాన్ని క్లబ్‌గా మార్చేశారు.. బర్త్ డే పార్టీ చేసుకుని చిందులేశారు

ప్రభుత్వ ఉద్యోగులు ఓవరాక్షన్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్నే క్లబ్‌గా మార్చేశారు. ఏ కార్యాలయంలో పనులు చక్కబెట్టుకోవాలో.. ఆ కార్యాలయంలో చిందులేశారు. ఇలా ప్రభుత్వ కార్యాలయాన్ని క్లబ్‌గా మార్చేసి చిందేసిన

ప్రభుత్వ ఉద్యోగులు ఓవరాక్షన్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్నే క్లబ్‌గా మార్చేశారు. ఏ కార్యాలయంలో పనులు చక్కబెట్టుకోవాలో.. ఆ కార్యాలయంలో చిందులేశారు. ఇలా ప్రభుత్వ కార్యాలయాన్ని క్లబ్‌గా మార్చేసి చిందేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో గల మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఒక ఉద్యోగి పుట్టిన రోజు వేడుకలను అతని సహోద్యోగులు నిర్వహించారు. 
 
ఈ పుట్టిన రోజు వేడుకల కోసం కార్యాలయాన్ని క్లబ్‌గా మార్చేశారు. కేక్ కట్ చేసి చిందేశారు. స్త్రీ, పురుష బేధం లేకుండా ఉద్యోగులు విధి నిర్వహణను గాలికి వదిలేసి, సినిమా పాటలకు చిందేస్తూ ఆటపాటల్లో మునిగితేలారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించకుండా, ఇలా చిందులేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.