శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 16 జనవరి 2018 (14:01 IST)

అవినీతి అధికారుల చిట్టా నావద్ద ఉంది.. మరో భారతీయుడినవుతా... కమల్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే ఒక యాప్‌ను తయారుచేసి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు కమల్ హాసన్. ఆ యాప్‌లో ప్రజల నుంచి అధికసంఖ్యలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, అవినీతిపరులకు సంబంధించిన సమాచారం వచ్చింది. ఈ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా సే

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే ఒక యాప్‌ను తయారుచేసి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు కమల్ హాసన్. ఆ యాప్‌లో ప్రజల నుంచి అధికసంఖ్యలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, అవినీతిపరులకు సంబంధించిన సమాచారం వచ్చింది. ఈ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచారు కమల్ హాసన్. నేను ప్రజలకు ఇచ్చిన యాప్‌ను బాగా సద్వినియోగం చేసుకున్నారు. 
 
యాప్ ద్వారా వచ్చిన అధికారుల చిట్టాను చూసి భయపడిపోయా. నేను ఇప్పుడు మరో భారతీయుడిగా మారాల్సిన సమయం వచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నా. ప్రజల సమస్యలను తెలుసుకోవాలని భావిస్తున్నా. నా పార్టీ, నా గుర్తు ప్రకటించిన తరువాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం.
 
నాపై నమ్మకం ఉంచి మెసేజ్‌ల ద్వారా వారివారి సమస్యలు చెప్పుకున్న ప్రజలకు నేను అండగా ఉంటా. వారికి న్యాయం చేస్తానంటున్నారు కమల్ హాసన్. మరో భారతీయుడి అవతారమెత్తడానికి కమల్ హాసన్ సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.