పీఎఫ్ఐపై కొరఢా ఝుళించిన కేంద్రం.. ఐదేళ్ల నిషేధం
పాప్యులర్ ఫ్రంట్ ఫా ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం, ఉగ్ర సంస్థలకు నిధుల సేకరణ, ఉగ్రవాదంపై యువతకు శిక్షణ ఇవ్వడం వంటి ఆరోపణలను పీఎఫ్ఐ ఎదుర్కొంటుంది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ దర్యాప్తు చేపట్టి వంద మందికిపై పీఎఫ్ఐ సానుభూతిపరులను అరెస్టు చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా పీఎఫ్ఐ, దానికి అనుబంధ సంస్థలుగా ఉన్న 8 సంస్థలపై కేంద్రం కన్నెర్ర జేసింది. ఈ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. యూఏపీఏ చట్టం కింద ఈ సంస్థపై వేటు వేసినట్టు పేర్కొంది. కాగా, ఇటీవల పాట్నా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోడీ హత్యకు కూడా ఈ సంస్థ కుట్ర పన్నినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించింది. దేశంలో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై కేంద్రం నిషేధం విధించిన తర్వాత కేరళలో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్, కర్నాటకలో ఫోరం ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పాసరై సంస్థలు కలిసి 2007లో పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాగా అవతరించాయి.
కాగా, కేంద్రం నిషేధం విధించిన పీఎఫ్ఐ అనుబంధ సంస్థలు ఇవే... రెహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఇండియా ఇయామ్స్ కౌన్సిల్, ఆల్ ఇండియా ఇమాక్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ విమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపనర్ ఇండియా ఫౌండేషన్, రెహాబ్ ఫౌండేషన్‌లు ఉన్నాయి.