శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (17:41 IST)

మార్చి 2022 వరకు PMGKAY పథకం పొడిగింపు

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మార్చి 2022 వరకు పొడిగించారు. దీంతో ఈ పథకం కింద లబ్ధిదారులు మార్చి 2022 వరకు ఉచిత రేషన్ పొందుతారు. ప్రారంభంలో ఈ పథకం ఏప్రిల్-జూన్ 2020 వరకే ఉండేది. తర్వాత దీనిని నవంబర్ 30 వరకు పొడిగించారు. 
 
తాజాగా కింద జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) గుర్తించబడిన 80 కోట్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచిత రేషన్‌ను అందిస్తుంది. నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు (గోధుమ-బియ్యం) ఉచితంగా అందజేస్తారు. రేషన్ కార్డ్ అందుబాటులో ఉన్న ప్రతి పౌరుడు తన కోటా రేషన్‌తో పాటు ఈ పథకం కింద ప్రతి నెలా 5 కిలోల అదనపు రేషన్ పొందుతున్నాడు. అయితే రేషన్‌కార్డు లేనివారికి మాత్రం ఈ పథకం ప్రయోజనాలు అందవు.
 
ఈ నేపథ్యంలో రేషన్ కార్డ్ కలిగివుండే రేషన్ డీలర్లు ఈ పథకం కింద మీ కోటాకు ఆహారం ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు టోల్ ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. జాతీయ ఆహార భద్రతా పోర్టల్ (ఎన్ఎఫ్ఎస్ఎ)లో ప్రతి రాష్ట్రం కోసం టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి కాల్ చేయడం ద్వారా మీరు మీ ఫిర్యాదు చేయవచ్చు. అంతేగాకుండా.. ఎన్ఎఫ్ఎస్ఏ వెబ్‌సైట్‌కు వెళ్లి మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.