శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (13:38 IST)

33 ఏళ్లు ఛాయ్ మాత్రమే తాగిన మహిళ? ఎలాగంటే?

ఛాయ్ మాత్రమే 33ఏళ్ల పాటు తాగుతూ ఓ మహిళ జీవనం సాగిస్తోంది. దీంతో ఏవైనా అనారోగ్య సమస్యలు వున్నాయోమోనని కంగారుపడి వైద్యుల వద్దకు తీసుకుపోతే.. ఆమె ఆరోగ్యం భేష్‌గా వుందని చెప్పారు. టీ తాగుతూ బతకడం అసాధ్యమని.. కానీ 33 ఏళ్ల పాటు టీ తాగుతూ ఓ మహిళ గడపడం సామాన్య విషయం కాదని వైద్యులు చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చాయ్ వాలీ చాచీ అని ఆ మహిళను పిలుస్తారు. ఆమె పేరు పిల్లి దేవి. ఈమెకు డిఫిన్, భోజనం, డిన్నర్ అక్కర్లేదు. అన్నీ టీతోనే సరిపెట్టేసేది. ఛత్తిస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొఠియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లి దేవి.. 11 ఏళ్ల వయస్సులోనే ఆహారాన్ని వదిలిపెట్టేసింది. ప్రస్తుతం ఆమెకు 44 ఏళ్లు. 33 సంవత్సరాల పాటు ఆమె ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. సంపూర్ణ ఆరోగ్యంగా వుందని తెలిసింది.