శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (13:03 IST)

మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. వాటిని కోసేసిన భార్య.. ఎక్కడ?

క్షణిక సుఖం పెట్టుకునే వివాహేతర సంబంధాలు పలు రకాల దారుణాలకు దారితీస్తున్నాయి. సమాజంలో జరుగుతున్న హత్యల్లో పెక్కు కేసులు ఈ వివాహేతర సంబంధం కారణంగానే జరుగుతున్నట్టు పోలీసు శాఖ నేర విభాగం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా కట్టుకున్న భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ భార్య... మర్మాంగాన్ని కోసేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య... భర్త చర్యను ఏమాత్రం జీర్ణించుకోలేక ఆగ్రహంతో రగిలిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అతనిపై భార్య దాడి చేసి మర్మాంగాలను కోసేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఈ ఘటనకు భార్య పాల్పడిందని తెలిపారు. 
 
అయితే తీవ్ర గాయాలపాలైన భర్త కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.