శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 జూన్ 2017 (12:13 IST)

బాస్‌తో రొమాన్స్ చేసింది.. మొబైల్ ఫోనులో రికార్డ్ చేసింది.. ఆపై ప్రియుడితో కలిసి ఏం చేసిందంటే?

బాస్‌తో రొమాన్స్ చేసింది. ఆ దృశ్యాలను మొబైల్ ఫోనులో రికార్డు చేసింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి బాస్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. లక్షలు వసూలు చేసింది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. తమిళనాడు రాజధాని చెన్

బాస్‌తో రొమాన్స్ చేసింది. ఆ దృశ్యాలను మొబైల్ ఫోనులో రికార్డు చేసింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి బాస్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. లక్షలు వసూలు చేసింది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. తమిళనాడు రాజధాని చెన్నై కొలత్తూరు చెందిన సుకన్య అలియాస్ సుగన్య (25), ఆమె ప్రియుడు ప్రవీణ్ కుమార్ (40) అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
చెన్నై నగరంలోని మాధవరంలో నివాసం ఉంటున్న విజయరాజన్ (45) వ్యాపారం చేస్తున్నాడు. కొలత్తూరుకు చెందిన సుకన్య విజయరాజన్ దగ్గర ఉద్యోగంలో చేరింది. విజయరాజన్ దగ్గర సుకన్య చాల నమ్మకంతో ఉండేది. వ్యాపారంలో సహకరించేది. చివరికి విజయరాజన్ ఒంటరిగా ఉన్న సమయంలో అతన్ని తన అందంతో రెచ్చగొట్టింది. అతన్ని తన తగ్గరకు తీసుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించింది. విజయరాజన్ కూడా ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ మూడేళ్ల పాటు రాసలీలలు కొనసాగించారు. 
 
అయితే సుగన్య తన బాస్‌తో జరిపిన రొమాన్స్‌ను అతనికి తెలియకుండానే మొబైల్‌లో రికార్డు చేసింది. మరోవైపు తన ప్రేమికుడు ప్రవీణ్‌ కుమార్‌కి వేరే మహిళతో వివాహమైనా అతనితో సంబంధాలు కలిగివుంది. ఆపై విజయరాజన్‌‌కు రాసలీలల వీడియోలు చూపించి.. డబ్బులు లాగాలని ప్రయత్నించింది. ఈ వీడియో తనకు కాబోయే భర్త తీశాడని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే యూట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని సాకులు చెప్పింది.
 
అలా చేస్తే విజయ్ వ్యాపారంతో పాటు తన జీవితం కూడా నాశనమవుతుందని బెదిరించింది. ఇలా సుకన్య ఆమె ప్రియుడు ప్రవీణ్ కలిసి వ్యాపారి విజయరాజన్‌ను బ్లాక్ మెయిల్ చేసి అతని దగ్గర రూ. 50 లక్షలు లాగేశారని వెలుగు చూసింది. ఇలా అనేకసార్లు బెదిరించి డబ్బులు లాగడంతో విసిగిపోయిన విజయరాజన్ చెన్నై నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేంద్రన్‌కు ఫిర్యాదు చేశారు.
 
చెన్నై నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేంద్రన్ ఆదేశాల మేరకు ఇన్స్‌పెక్టర్ శంకర్ వెంటనే సుకన్య, ప్రవీణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తమ నేరాన్ని అంగీకరించారు. ఇంకా సుకన్య నుంచి అశ్లీల దృశ్యాలు ఉన్న మొబైల్‌లు, 15 సవర్ల బంగారం, 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.