గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (09:26 IST)

గంజాయి మత్తులో కిరాతకం... హత్య చేసి శవంతో సెల్ఫీ.. ఎక్కడ?

ఓ వ్యక్తి గంజాయి మత్తులో అత్యంత కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఓ యువకుడిని హత్య చేసి.. శవంతో సెల్ఫీ దిగాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని ఆదంబాక్కంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక పరంగిమలై ఆదంబాక్కం పోలీసు స్టేషన్‌ వెనుకవైపు రెండు రోజుల క్రితం ముగ్గురు యువకులు గంజాయి సేవించేందుకు అక్కడికి వెళ్లారు. కొద్ది సేపటికి బయటకు ఇద్దరు వ్యక్తులే వెళ్లడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. 
 
దీంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజీలను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఓ చోట మట్టి తవ్వి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్లి మట్టిని తొలగించి చూడగా ఒక యువకుని శవం తీవ్ర గాయాలతో, ముఖం చిద్రమైన స్థితిలో ఉండటాన్ని గమనించారు. 
 
దీంతో ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా చేయించారు. ఆ తర్వాత దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఆ ముగ్గురు యువకుల్లోని ఒకడు కలైంజర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఆనంద్‌‌గా గుర్తించారు. అతను అజ్ఞాతంలోకి వెళ్లగా.. అతడి స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఆనంద్‌ గంజాయి మత్తులో ఒక యువకుడిని చంపి, అతని శవంతో సెల్ఫీ దిగి వాట్సాప్‌ గ్రూపులో పెట్టాడని వెల్లడించాడు. దీంతో వారిపై హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు, పరారీలో ఆనంద్ కోసం గాలిస్తున్నారు.