గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2016 (16:17 IST)

పని ఒత్తిడి... సెలవు ఇవ్వలేదని తుపాకీతో కాల్చుకున్నాడు!

తనకు సెలవు ఇవ్వలేదన్న కారణంతో ఓ కానిస్టేబుల్ తపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ గోపినాథ్ స్వగ్రామం మధురైలోన

తనకు సెలవు ఇవ్వలేదన్న కారణంతో ఓ కానిస్టేబుల్ తపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ గోపినాథ్ స్వగ్రామం మధురైలోని వడిపట్టి వాసిగా గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చెన్నై పరంగిమలైలోని పోలీసు ఆర్మ్ డ్ ఫోర్స్‌స్‌లో గత 2013లో చేరాడు. గోపినాథ్‌ను ట్రైనింగ్ అనంతరం పళని బెటాలియన్‌లో పోస్టింగు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని పరంగిమలైకు బదిలీ కావడంతో గోపినాథ్ అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
 
శనివారం పని ఒత్తిడితో అలసిపోయిన గోపినాథ్ రాత్రి తన గదికి వెళ్లి సర్వీస్ రైఫిల్‌తో తలలో కాల్చుకున్నాడు. గన్ ఫైర్ అయిన శబ్దం విన్న మిగిలిన పోలీసులు హుటాహుటిన అక్కడి చేరుకుని అప్పటికే ప్రాణాలు వదిలిన గోపినాథ్‌ను చూశారు.
 
గోపినాథ్ ఆత్మహత్యపై ఆయన సహోద్యోగులను ప్రశ్నించగా.. పెద్ద ఆశలతో అందరూ ఉద్యోగాల్లో చేరినట్లు చెప్పారు. తమపై పని ఒత్తిడి విపరీతంగా ఉంటోందని.. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు.