గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (18:23 IST)

బోరుబావిలో పడిపోయిన పదేళ్ల బాలుడు.. 60 అడుగుల దూరంలో..?

borewell
బోరుబావిలో ఓ బాలుడు పడిపోయాడు. అతనిని కాపాడేందుకు దాదాపు 13 గంట‌లు రెస్క్యూ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తుంది.ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని చంపా జిల్లాలోని పిహ్రిద్ గ్రామంలో ఓ  పన్నెండేళ్ల బాలుడు ఆడుకుంటుండంగా పూడ్చకుండా వదిలేసిన బోరు బావిలో పడిపోయాడు. 
 
పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కలా వెతికారు. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు. గ్రామస్థుల స‌మాచారం మేర‌కు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.  
 
బోరు బావి దాదాపు 80 అడుగుల లోతులో ఉండగా.. పిల్ల‌వాడు  50 నుంచి 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. పిల్ల‌వాడు ప‌డి దాదాపు 13 గంటలు కావ‌స్తుంది. పిల్ల‌వాడిని రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి. 
 
సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయకచర్యలు ముమ్మరం చేశారు. ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలంలో చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్టు స‌మాచారం. సొరంగం తవ్వేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.