శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:43 IST)

ఛార్జింగ్‌ పెట్టి గేమ్ ఆడిన బాలుడు.. స్మార్ట్‌ఫోన్ పేలింది.. పేగు బయటికొచ్చింది..

చిన్నారుల చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు తమ పని తాము చేసుకుంటున్నారా? పిల్లలు మారాం చేస్తున్నారని పిల్లలకు స్మార్ట్ ఫోన్లిచ్చి గేమ్స్ ఆడుకోమంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ ఘటన గురించి తెల

చిన్నారుల చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు తమ పని తాము చేసుకుంటున్నారా? పిల్లలు మారాం చేస్తున్నారని పిల్లలకు స్మార్ట్ ఫోన్లిచ్చి గేమ్స్ ఆడుకోమంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ ఘటన గురించి తెలుసుకుంటే.. పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ అస్సలు పెట్టరు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మొబైల్ గేమ్ ఆడుతుండగా, స్మార్ట్ ఫోన్ పేలి బాలుడు మృతి చెందాడు. 
 
ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవి సోన్‌వాన్ (12) ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతుండగా ఆతడి ఫోన్ చేతిలోనే పేలింది. పేలుడు ధాటికి రవి పేగులు బయటపడ్డాయి.
 
కుటుంబ సభ్యులు వెంటనే వాటిని లోపల పెట్టి కడుపు చుట్టూ గట్టిగా కాటన్ కట్టి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాలుడికి ఆపరేషన్ జరిగినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో రవి మృతి చెందాడు. ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడిన కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు చెప్తున్నారు.