సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (15:43 IST)

లింగసమానత్వం : అబ్బాయిలు స్కర్ట్స్ వేసుకోవచ్చు

లండన్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాల కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మధ్య లింగభేదాన్ని తొలగించేందుకు మగపిల్లలు ఇకపై అమ్మాయిల మాదిరిగా తమకు ఇష్టమైన స్కర్ట్స్ వేసుకునేందుకు అనుమతిచ్చింది.

లండన్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాల కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మధ్య లింగభేదాన్ని తొలగించేందుకు మగపిల్లలు ఇకపై అమ్మాయిల మాదిరిగా తమకు ఇష్టమైన స్కర్ట్స్ వేసుకునేందుకు అనుమతిచ్చింది. అదేవిధంగా విద్యార్థుల్ని విడదీసేలా ఉన్న మగ, ఆడ విద్యార్థులకు బదులుగా ప్యూపిల్ అని పిలువాలని కూడా ఆ పాఠశాల నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈస్ట్ మిడ్‌ల్యాండ్ పరిధిలోని రుత్‌ల్యాండ్ అప్పింగమ్ పాఠశాల ఈ వినూత్న నిర్ణయానికి వేదికైంది. ఇకపై మా పాఠశాలలో విద్యార్థులు వారికిష్టమైన డ్రెస్‌లు వేసుకునేందుకు అనుమతిస్తున్నాం. లింగసమానత్వం కోసమే ఇదంతా చేస్తున్నట్టు స్కూల్ హెడ్మాస్టర్ రిచర్డ్ మలోనే వెల్లడించారు. ఎంబ్రేసింగ్ బాడీస్ అనే టీవీ షోలో డాక్టర్ క్రిస్టియన్ జెస్సన్ పాఠశాలలో చదివే రోజుల్లో తనకు స్కర్ట్ వేసుకోవాలన్న కోరికను అణుచుకున్నానని చెప్పిన వ్యాఖ్యల మేరకు అప్పింగమ్ పాఠశాల నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.