కుక్కల ద్వారా భారత్‌లోకి వైరస్‌ను పంపిన చైనా... చెన్నైలో కలకలం...
భారత్‌లోకి శత్రుదేశం చైనా వైరస్‌ను పంపించినట్టు తెలుస్తోంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో చెన్నై వైద్యులు ఆ కుక్కల రక్తం శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారు.
భారత్‌లోకి శత్రుదేశం చైనా వైరస్‌ను పంపించినట్టు తెలుస్తోంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో చెన్నై వైద్యులు ఆ కుక్కల రక్తం శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారు.
చెన్నైకు సమీపంలోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరులోని సిప్‌కాట్ ప్రాంగణంలో మొబైల్ కంపెనీ ఉంది. దీనికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులోభాగంగా, చైనా నుంచి చెన్నై హార్బర్‌కు వచ్చిన ఓ కంటైనర్‌లో మొబైల్ పరికరాలతో పాటు.. రెండు కుక్కలు పిల్లలు కూడా ఉన్నాయి.
ఈ విషయాన్ని స్థానికంగా ఉండే బ్లూ క్రాస్ ప్రతినిధులకు చేరవేశారు. బ్లూక్రాస్ సిబ్బందితో పాటు.. వెటర్నరీ వైద్యులు అక్కడికి చేరుకున్న బ్లూక్రాస్ సిబ్బంది కుక్కపిల్లలకు పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి దిగుమతి అయిన ఈ కుక్కపిల్లల ద్వారా వైరస్‌ను పంపివుండవచ్చన అనుమానంతో వాటి రక్త నమూనాలను పరీక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.