మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:11 IST)

ఉపరాష్ట్రపతిని కలిసిన చిన్న జీయర్ స్వామి

సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపు మాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక,  సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. 
 
మంగళవారం నాడు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసానికి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు విచ్చేశారు. 
 
హైదరాబాద్ ముచ్చింతల్ లో 2022 ఫిబ్రవరిలో జరగనున్న 216 అడుగుల సమతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి దంపతులకు ఆహ్వానాన్ని అందజేశారు.